రాష్ట్ర జీడీపీ వృద్ధి దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌

ABN , First Publish Date - 2022-03-05T07:26:24+05:30 IST

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ వృద్ధి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజక వర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర జీడీపీ వృద్ధి దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌

 మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌, మార్చి 4: కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ వృద్ధి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి వేముల   ప్రశాంత్‌రెడ్డి  అన్నారు.  బాల్కొండ నియోజక వర్గంలోని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో రూ.5లక్షల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.11లక్షల కోట్ల వృద్ధికి చేరుకుందని అన్నారు. రాష్ట్ర తలసారి ఆదాయం 130శాతం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జనరంజక పాలనతో నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయన్నారు. బాల్కొండ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నాడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. నియోజకరవ్గంలో గ్రామంలో అంతర్గత సీసీరోడ్ల కోసం 15రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.23కోట్ల 5లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఏర్పడిన 18గ్రామపంచాయతీ నూతన భవనాల కోసం రూ.3కోట్ల 60లక్షలు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలోని బీటీ రోడ్లు, ఇరిగేషన్‌ పనులు, కొత్తగా మోతె, వేల్పూర్‌, పడిగెల్‌, వెల్కటూర్‌, హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.100కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 

 మండలాల వారీగా మంజూరైన నిధులు..

నియోజకవర్గంలోని బాల్కొండ మండలానికి రూ.2.65కోట్లు, ముప్కాల్‌ మండలానికి రూ.1.55కోట్లు, మెండోర మండలానికి రూ.1.80కోట్లు, వేల్పూర్‌ మండ లానికి రూ.6.10కోట్లు, భీమ్‌గల్‌ మండలానికి (మున్సిపాలిటీ మినహాయించి) రూ.2.85కోట్లు, కమ్మర్‌ పల్లి మండ లానికి రూ.3.65కోట్లు, మోర్తాడ్‌ మండలా నికి రూ.1.95కోట్లు, ఏర్గట్ల మండలానికి రూ.1.45కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని మంత్రి  ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మానాల గ్రామంలో పాటు కొత్తగా ఎనిమిది గ్రామపంచాయతీల భవనం కోసం రూ.1.05కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడిం చారు. ఆయా మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తా మన్నారు. కళ్ల ముందు ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరైంది కాద న్నారు. అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉం దని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చెబుతున్న ప్పటికీ ఇక్కడి బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, జిల్లా ఆర్‌టీఏ కమిటీ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

Read more