అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-05T05:56:06+05:30 IST
పట్టణానికి చెందిన ఒకరు శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి పండరి(36) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఎల్లారెడ్డి, మార్చి 4: పట్టణానికి చెందిన ఒకరు శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి పండరి(36) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యం, పేకాటకు బానిసగా మారాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో కలహాలు వచ్చాయి. మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అనురాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.