ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే..

ABN , First Publish Date - 2022-08-04T06:03:14+05:30 IST

ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని పట్టుదలతో చదవాలని, అంకిత భావంతో చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతీ మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు.

ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే..
అభ్యర్థులకు అవగాహన కల్పిస్తున్న పార్థసారఽథి

కామారెడ్డి టౌన్‌, ఆగస్టు 3: ప్రణాళికతో చదివితే విజయం మీదే అవుతుందని పట్టుదలతో  చదవాలని, అంకిత భావంతో చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతీ మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులు పాటించవలసిన మెలకువలను అర్థవంతంగా ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. తన స్వీయ అనుభవాలను జోడించి పలు అంశాలపై అవగాహన కల్పించి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యమవుతుందన్నారు. అపజయం ఎదురైనంత మాత్రానా ప్రయత్నించడం ఆప కూడదని ఆత్మ విశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నారు. కోరుకున్న ఉద్యోగం సాధించాలని నిరుద్యోగులకు దిశా నిర్దేశం చేశారు. సిలబస్‌పై పట్టుకలిగి ఉండాలని సూచించారు. పాత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుంటూ పరీక్ష విధానానికి అనుగుణంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. అనవసర సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల వాతావరణంలో ఏకాగ్రతతో సిద్ధం కావాలని కోరారు. పరీక్షల్లో ప్రతీ ప్రశ్న కీలకమని, ప్రిపరేషన్లు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. బట్టీ పద్ధతికి స్వస్తిపలికి విశ్లేషనాత్మక ప్రిపేరేషన్‌ కొనసాగించాలని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం వచ్చిందని ఇప్పటికే గ్రూప్‌ 1, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు వచ్చాయని తెలిపారు. త్వరలోనే గ్రూప్‌ 2, 4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి, యువకులకు ఎస్‌సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్నామన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని పరీక్ష పూర్తిచేసే వరకు నిరంతరం కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, ఏఎస్‌పీ అనోన్య, ఆర్‌టీఓ వాణి, ప్రిన్సిపాల్‌ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T06:03:14+05:30 IST