విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-03-06T05:04:07+05:30 IST

విద్యార్థులు ఉత్తమ పౌర స మాజ నిర్మాణం కోసం ప్రతీఒక్కరూ శాస్త్రీయ విజ్ఞానా న్ని పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు నర్రా రామారావు అన్నారు.

విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

మోర్తాడ్‌, మార్చి5: విద్యార్థులు ఉత్తమ పౌర స మాజ నిర్మాణం కోసం ప్రతీఒక్కరూ శాస్త్రీయ విజ్ఞానా న్ని పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు నర్రా రామారావు అన్నారు. మండల కేం ద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం, జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవ వేడు కలను పురస్కరించుకొని విద్యార్థులకు శాస్త్రీయ ఆలో చనలు, విద్యార్థులు అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతు లతో పాటు మార్పు రేపటి కోసం అనే పుస్తకాలను అందజేశారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్రా రామారావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌ పట్ల అవగాహన పెంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో చైతన్యం తేవాలని అన్నారు. కరోనా వైరస్‌ను ఏ దేవుడు, ఏ మ తం ఎదుర్కొలేదని, శాస్త్రవేత్తలు, డాక్టర్‌లు చేసిన ప్ర యోగాలు వారు మనకు అందించిన పరిశోధనలు, ప్ర యోగాలు, ప్రచీన వల్ల వైరస్‌ నుంచి మనల్ని కాపాడు కున్నామని అన్నారు. శాస్త్రసాంకేతికతోనే సమాజం అభి వృద్ధి చెందుతోందని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంధ్రయ్య, జన విజ్ఞాన వేదిక మోర్తాడ్‌ అధ్యక్షుడు నర్సయ్య, వెంకటమల్లయ్య పాల్గొన్నారు.   

విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

నవీపేట: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శనివారం నవీపేట జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో శాస్త్రీయ ఆలోచనలు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈవో గణేష్‌ రావు, జన విజ్ఞాన వేదిక సభ్యులు రాజశేఖర్‌, సాయన్న, కిషన్‌, రాహుల్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:04:07+05:30 IST