మొలకెత్తని నకిలీ జొన్న విత్తనాలు

ABN , First Publish Date - 2022-01-04T05:13:24+05:30 IST

యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించారు. జొన్న పంటను పండించడానికి రైతులు భూములను చదును చేశారు. దుక్కి దున్ని జొన్న విత్తనాలు వేశారు. తీరా నెలరోజులైనా విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు.

మొలకెత్తని నకిలీ జొన్న విత్తనాలు
విత్తనాలు విక్రయించినట్లు తెల్ల కాగితాలపై రాసిచ్చిన రశీదులు

 కాస్లాబాద్‌ శివారులో దాదాపు 60 ఎకరాల్లో మొలకెత్తని జొన్న విత్తనాలు
 రశీదులు ఇవ్వకుండా కాగితాలపై రాసిచ్చిన ఫర్టీలైజర్లు
 పట్టించుకోని అధికారులు

పెద్ద కొడప్‌గల్‌, జనవరి 3: యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించారు.  జొన్న పంటను పండించడానికి రైతులు భూములను చదును చేశారు. దుక్కి దున్ని జొన్న విత్తనాలు వేశారు. తీరా నెలరోజులైనా విత్తనాలు మొలకెత్తక పోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. తాము మోసపోయామని, నకిలీ జొన్న విత్తనాలను వ్యాపారులు తమకు అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా పంటలు పండ డం, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా జొన్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో విలపిస్తున్నారు. పెద్దకొడప్‌గ ల్‌ మండలంలోని కాస్లాబాద్‌ గ్రామ శివారులో సు మారు 60ఎకరాల్లో రైతులు జొన్న పంటను వేశారు. జొన్న విత్తనాలను వ్యాపారులు రైతులు విక్రయించా రు.  రైతులకు విక్రయించిన జొన్న విత్తన ప్యాకెట్లకు రసీదులు కూడా ఇవ్వలేదు. నామమాత్రం కాగితంపై ధరలు వేసి విక్రయించారు. నెల రోజులైన విత్తనాలు మొలకెత్త కపోవడంతో సదరు దుకాణదారులను ప్ర శ్నించగా,  సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నా రు. గతంలోనూ నకిలీ విత్తనాలు రైతన్నలు నిండా ముంచినా సంబంధిత దుకాణ దారులు, కంపెనీలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇలాంటి సంఘట నలు పునరావృత్తమవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తూతూ మంత్రంగా ఫర్టీలైజర్‌ దుకాణాలను తనిఖీ చేయడంతో వ్యాపారులు ఇష్టారాజ్యం గా రైతులకు నకిలీ విత్తనాలను అమ్ముతున్నారని చెబుతున్నారు. రైతులు నష్టపోతున్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే తమ దృషి ్టకి ఇప్పుడే వచ్చిందని దాటవేసే సమాధానాలు వ్యవసాయ అధికారులు చెబుతున్నారని, మండలంలో జరిగే విషయాలు తెలియవా? అని పలువురు రైతు లు ప్రశ్నిస్తున్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెబుతూ విత్తనాలను సరఫరా చేయడంలేదని, ఇలా మోసపోతే కనీసం చర్య లు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబం ధిత దుకాణ దారులపై, కంపెనీలపై సంబంధిత ఉన్నతా ధికారులు కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి సంఽఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరుతున్నారు.
మా దృష్టికి రాలేదు
నకిలీ జొన్న విత్తనాలు మొలకెత్త లేదని మా దృష్టికి రాలేదు. రైతులు మాకు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి సీడ్‌ కంపెనీపై, విత్తన డీలర్లపై చర్యలు తీసుకుంటాం.
ఫ నదీముద్దీన్‌, ఏవో

Updated Date - 2022-01-04T05:13:24+05:30 IST