విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-08-04T06:14:20+05:30 IST

వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈవో రాధాకిషన్‌తో కలిసి బుధవారం తనిఖీ చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
పాఠశాల పరిసరాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

వీర్నపల్లి, ఆగస్టు 3: వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈవో రాధాకిషన్‌తో కలిసి బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో వంటగది, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అనుభవం గల వంటమనుషులను నియమించాలన్నారు.  ద్యార్థుల భోజనానికి తాజాకూరగాయలు వినియోగించాలన్నారు. వంట వండే సమయంలో మిషన్‌భగీరథ నీటిని వాడాలని సూచించారు. పాఠశాల, వసతి గృహాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేయించాలని ఆదేశించారు. విద్యార్తుల ఆరోగ్య వివరాలను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఎంపీపీ మాలోతు బూల, ఎంపీడీవో భారతి, సర్పంచ్‌ దినకర్‌, ఉపసర్పంచ్‌ బోయిన రవి ఉన్నారు. 

Updated Date - 2022-08-04T06:14:20+05:30 IST