ప్రాణాలు తీసిన రేకుల షెడ్డు!

ABN , First Publish Date - 2022-07-06T05:34:47+05:30 IST

ఇంటి ముందు నీడ కోసం వేసిన రేకుల షెడ్డు ఇద్దరి ప్రాణాలు బలిగొంది. విద్యు త్‌ సరఫరా కావడంతో కూ తురితో పాటు తల్లీ మృత్యువాత పడిన ఘటన బాన్సువాడ మండలం ఖాద్లా పూర్‌లో మంగళవారం చో టు చేసుకుంది.

ప్రాణాలు తీసిన రేకుల షెడ్డు!

విద్యుత్‌ షాక్‌కు గురై తల్లీకూతురి మృత్యువాత 

కామారెడ్డి జిల్లాలో విషాదం 

బాన్సువాడ, జూలై 5 : ఇంటి ముందు నీడ కోసం వేసిన రేకుల షెడ్డు ఇద్దరి ప్రాణాలు బలిగొంది. విద్యు త్‌ సరఫరా కావడంతో కూ తురితో పాటు తల్లీ మృత్యువాత పడిన ఘటన  బాన్సువాడ మండలం ఖాద్లా పూర్‌లో మంగళవారం చో టు చేసుకుంది. స్థానికంగా విషాదం నింపిన ఘటన వివరాల్లోకి వెళితే.. ఖా ద్లాపూర్‌ గ్రామానికి చెందిన తుకారాం, అంకిత (25) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందు లో అంకిత (5) గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చ దువుతోంది. మంగళవారం ఏ బీవీపీ విద్యాసంస్థల బంద్‌కు పి లుపునివ్వడంతో.. అక్షర తన చెల్లెలు హరిద్రతో ఇంటి వద్దే ఆడు కుంటోంది. తుకారాం తనింటి ఎదుట నీడ కోసమని ఇటీవలే రేకుల షెడ్డు వే యించాడు. రేకుల కిందే కుటుంబం మొత్తం ఎక్కువ సమయం గడుపుతుండడంతో.. ఫ్యాన్‌ కూడా బిగించుకున్నాడు. ఫ్యాన్‌ కోసం ఇంట్లో నుంచి తీసుకొచ్చిన వైర్‌ తె గి ఇనుప రేకులకు తగలడంతో.. ఒక్కసారిగా ఇనుప రాడ్‌లకు కరెంటు ప్రవహించింది. ఇది తెలియని చిన్నారి అక్షర ఆడుకుంటూ వచ్చి ఇనుప రాడ్‌కు ప ట్టుకుంది. ఒక్కసారిగా షాక్‌ కొట్టడంతో అమ్మా.. అని అరిచింది. కూతురికి ఏ మైందోనన్న భయంతో తల్లి చిన్నారిని పట్టుకోవడంతో ఆమె కూడా వి ద్యుత్‌ షాక్‌కు గురైంది.ఈ ఘటనలో తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు. 

మరో ఇద్దరి ప్రాణాలు కాపాడిన ‘కరెంటు’ 

కాగా.. ఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే గ్రామంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో అంకిత భర్త తుకారాం ఇంటికి వచ్చాడు. భార్య, కూతురు కింద పడిపోయి ఉండడంతో.. ఏం జరిగిందోనన్న భయంతో పైకి లేపేందుకు ప్రయత్నించాడు. రేకుల షెడ్డుకు కొద్ది దూరంలోనే చిన్న కూతురు హరిద్ర ఆడుకుంటుండగా.. తండ్రిని చూసి పరుగున వచ్చింది. అయితే విద్యుత్‌షాక్‌తో మృతి చెందారన్న విషయం తెలియడంతో.. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. ఒకవేళ ఆ సమయంలో గ్రామంలో విద్యుత్‌ సరఫరా గనుక నిలిచిపోక పోతే.. తండ్రితో పాటు చిన్న కూతురు కూడా మృత్యువాత పడేది. తుకారాం కుటుంబానికి ‘కరెంటు’ ఓ రకంగా మేలు.. మరో రకంగా కీడు చేసినట్లయ్యింది. మరోవైపు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భార్య, పెద్ద కూతురు మృతి చెందడంతో.. తుకారం గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భర్త తుకారాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-06T05:34:47+05:30 IST