మొబిలైజేషన్‌ కమిటీ చైర్మన్‌గా సౌదాగర్‌ గంగారాం

ABN , First Publish Date - 2022-10-19T05:24:42+05:30 IST

రాష్ట్రంలో అక్టోబరు 23 నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడోయాత్ర వివిధ కమిటీల నియామకం జరిగినట్లు కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం తెలిపారు.

మొబిలైజేషన్‌ కమిటీ చైర్మన్‌గా సౌదాగర్‌ గంగారాం

మద్నూర్‌, అక్టోబరు 18 : రాష్ట్రంలో అక్టోబరు 23 నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడోయాత్ర వివిధ కమిటీల నియామకం జరిగినట్లు కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం తెలిపారు. జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాంకు మొబిలైజేషన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేశారని తెలిపారు. జుక్కల్‌ నియోజకవర్గంలో భారత్‌ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. తనను మొబిలైజేషన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జుక్కల్‌ నియోజకవర్గంలో యాత్ర విజయవంతం చేసేలా ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర కమిటీ సభ్యులుగా విక్రమార్క,   ఉత్తం కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, సంపత్‌ కుమార్‌, షబ్బీర్‌ అలీ, వినోద్‌, శివకుమార్‌, అనసూయ, ప్రభాకర్‌, ప్రసాద్‌ కుమార్‌, రామ్మోహన్‌ రెడ్డి తదితరులు 15 మంది నియమించినట్లు కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

Updated Date - 2022-10-19T05:24:42+05:30 IST