బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.34.20 కోట్ల మంజూరు

ABN , First Publish Date - 2022-11-30T00:08:01+05:30 IST

: కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ మండలాల్లో 15 బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేసేందుకు రూ.34కోట్ల20 లక్షల 40 వేలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.34.20 కోట్ల మంజూరు

కామారెడ్డి,నవంబరు 29: కామారెడ్డి నియోజకవర్గంలో వివిధ మండలాల్లో 15 బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేసేందుకు రూ.34కోట్ల20 లక్షల 40 వేలు మంజూరైనట్లు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. మంగళవారం ఆయనస్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల నిధులతో కామారెడ్డి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. బీబీపేట మండలంలో మందాపూర్‌ నుంచి పెద్దమల్లారెడ్డి వయా ఉప్పర్‌పల్లి వరకు రూ.8 కోట్ల 20లక్షలు, మల్కాపూర్‌ నుంచి సిరిగాధ వయా నక్కలకుంట వరకు రూ.16లక్షలు,ఇస్సానగర్‌ నుంచి నందగోకులం వరకు రూ.12లక్షలు, జనగామ నుంచి అంబర్‌పేట పీఆర్‌రోడ్డు వరకు రూ.28 లక్షలు, దోమకొండ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వడ్డెరకాలనీ వయా అంబర్‌పేట వరకు రూ.12 కోట్లు, అంచనూర్‌ నుంచి అంబర్‌పేట రోడ్డువరకు రూ.12లక్షలు, ముత్యంపేట నుంచి పల్వంచ వరకు రూ.36లక్షలు, రామారెడ్డి మండలం తూంపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బట్టు తండా వయావాసురాం వరకు రూ.16కోట్ల 5 లక్షలు, భిక్కనూర్‌ మండలం లక్ష్మీదేవునిపల్లి నుంచి బంజర్ల రోడ్డువరకు రూ.20 లక్షలు, ర్యాగట్లపల్లి నుంచి బస్వాపూర్‌ వరకు 20లక్షలు, అంతంపల్లి నుంచి లక్ష్మీదేవునిపల్లి రోడ్డువరకు రూ.16లక్షలు,తిప్పాపూర్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి మల్లిఖార్జున నగర్‌ రోడ్డు వరకు రూ.20లక్షలు, కామారెడ్డి మండలం గుడెం నుంచి తిమ్మక్‌పల్లి వరకు రూ.20 లక్షలు, గర్గుల్‌ నుంచి శాబ్దిపూర్‌ వరకు రూ.24 లక్షలు,చిన్నమల్లారెడ్డి ఆర్‌అండ్‌బీ రోడ్డునుంచి తిమ్మక్‌పల్లి రోడ్డు వయా బీసీ కాలనీవరకు రూ.45లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్‌,ఏఎంసీ చైర్మన్‌ పిప్పిరి వెంకటి,కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకురి రాంరెడ్డి,నాయకులు వజ్జెపల్లి ఆంజనేయులు,నర్సింలు, లక్ష్మీనారాయణ, బలవంతరావుతదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:08:19+05:30 IST

Read more