కాకతీయ కాలువకు నీటి విడుదల

ABN , First Publish Date - 2022-12-17T00:32:15+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా యాసంగి సీజన్‌లో పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా వదులుతున్న నీటిని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి అన్నారు.

కాకతీయ కాలువకు నీటి విడుదల

మెండోర, డిసెంబరు 16: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా యాసంగి సీజన్‌లో పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా వదులుతున్న నీటిని ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాజెక్టు ఈఈ చక్రపాణి అన్నారు. శుక్రవారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. కాకతీయ కాలువకు వారబంధి ప్రకారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల జరుగుతుందని వారబంధి ప్రకారం రైతులు ఉపకాలువల ద్వారా నీటిని నిలిపి అధికారులతో రైతులు సహకరించాలని కోరారు. యాసంగి పంటలకు 63టీఎంసీల నీటిని కేటాయించినట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 500క్యూసెక్కులు నీటిని విడుదల చేసి క్రమంగా 2500క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90టీఎంసీ)లు కాగా ప్రస్తుత నీటిమట్టం 1091అడుగుల (90టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని తెలిపారు. ప్రాజెక్టు నుంచి సరస్వతి కాలువకు 100క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 445క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 152క్యూసెక్కులు ఔట్‌ఫ్లో వెళ్తుందని తెలిపారు.

Updated Date - 2022-12-17T00:32:16+05:30 IST