పథకం ప్రకారమే రంజిత్‌కుమార్‌ హత్య

ABN , First Publish Date - 2022-12-07T00:25:00+05:30 IST

అంక్సాపూర్‌లో బుట్టి రంజిత్‌కుమార్‌(33)ను పథకం ప్ర కారమే ఆయన భార్య జమున, కుమారుడు మనోజ్‌, మమ గంగారాం, ఆమె ప్రియు డు నగేష్‌లు కలిసి రంజిత్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు వివరించారు. మంగళవారం వేల్పూర్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు విలేకరుల సమావే శంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. మృతుడు రంజిత్‌కుమార్‌ ప్రతీరోజు బాగా మ ద్యం తాగిన మైకంలో భార్య, పిల్లలను కొడుతూ హింసించేవాడని కుటుంబసభ్యులు పేర్కొన్నట్టు తెలిపారు.

పథకం ప్రకారమే రంజిత్‌కుమార్‌ హత్య

వేల్పూర్‌, డిసెంబరు6: అంక్సాపూర్‌లో బుట్టి రంజిత్‌కుమార్‌(33)ను పథకం ప్ర కారమే ఆయన భార్య జమున, కుమారుడు మనోజ్‌, మమ గంగారాం, ఆమె ప్రియు డు నగేష్‌లు కలిసి రంజిత్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు వివరించారు. మంగళవారం వేల్పూర్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు విలేకరుల సమావే శంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. మృతుడు రంజిత్‌కుమార్‌ ప్రతీరోజు బాగా మ ద్యం తాగిన మైకంలో భార్య, పిల్లలను కొడుతూ హింసించేవాడని కుటుంబసభ్యులు పేర్కొన్నట్టు తెలిపారు. దీంతో భార్య జమున, కుమారుడు మనోజ్‌, మామ గంగారాం, ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న నగేష్‌లు కలిసి రంజిత్‌ను చంపాలని పథకం రూపొందించారని తెలిపారు. లక్కోర క్రాస్‌రోడ్డు ప్రాంతంలో నవాబు లిఫ్ట్‌ సమీపంలో ఉన్న పొలం వద్దకు అక్టోబరు 20న రాత్రి 7 గంటల సమయంలో మృతుడు రంజిత్‌ కుమార్‌ వెళ్లాడని అన్నారు. ఇదీ గమనించిన ముగ్గురు నిందితులు కలిసి ముందుగా నే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం పొలం వద్దకు వెళ్లి కర్రలతో రంజిత్‌కుమార్‌ తలపై బలంగా కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం పొలం వద్ద ఉన్న గడ్డపారా తో ముగ్గురు కలిసి మామిడిచెట్టు వద్ద పొలంలో గోతి తవ్వి అందులో రంజిత్‌ మృతదేహాన్ని వేసి మట్టితో పూడ్చి అనుమానం కలుగకుండా గడ్డి కప్పారన్నారు. హత్యకు వాడిన కర్రలను కొంతదూరంలోకి పారవేశారన్నారు. హత్య చేసిన నాలుగు రోజులకు అక్టోబరు 24న మృతుడి భార్య జమున వేల్పూర్‌ పోలీసుస్టేషన్‌లో తన భర్త కనిపించడంలేదని ఫిర్యాదు చేసిందన్నారు. పోలీసులు విచారణలో భాగంగా మృతుడి సెల్‌ఫోన్‌ డాటా తీయగా నగేష్‌పై అనుమానం వచ్చి ఆయనను పట్టుకొని విచారించి నట్లు చెప్పారు. హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడని తెలిపారు. మంగళవారం రంజిత్‌ ను హత్య చేసిన ఆయన భార్య జమున, ఆమె తండ్రి గంగారాం, ప్రియుడు నగేష్‌ల ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, ఆమె కుమారుడు మనోజ్‌ను జువెలైన్‌కు పంపినట్టు ఏసీపీ ప్రభాకర్‌రావు వివరించారు. ఆర్మూర్‌రూరల్‌ సీఐ గోవర్ధన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో కేసు ఛేఽదించిన వేల్పూర్‌ ఎస్సై వినయ్‌, ఏఎస్సై యాదగిరి, సిబ్బందిని ఏసీ పీ ప్రభాకర్‌రావు అభినందించారు.

Updated Date - 2022-12-07T00:25:02+05:30 IST