ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టాలి

ABN , First Publish Date - 2022-12-07T00:27:20+05:30 IST

జిల్లాకేంద్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ స మావేశ హాల్‌లో విద్యావైద్యశాఖపై స్థాయీ సంఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులను గుర్తించి వాటిని తనిఖీ చేయాలని ఆదేశించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టాలి

ఖిల్లా, డిసెంబరు 6: జిల్లాకేంద్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా పెట్టాలని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ స మావేశ హాల్‌లో విద్యావైద్యశాఖపై స్థాయీ సంఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులను గుర్తించి వాటిని తనిఖీ చేయాలని ఆదేశించారు. జీజీహెచ్‌లో రెండు నెలలుగా నమోదైనా డెంగ్యూ, మలేరియా కేసుల వివరాలను తెలుసుకోవాలన్నారు. సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని తెలిపా రు. జిల్లా జనరల్‌ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించేలా చూడాలని తెలిపారు. మధ్యా హ్నం జరిగిన సమావేశంలో సీడీపీవోలను ఉద్దేశించి చైర్మన్‌ మాట్లాడుతూ పి ల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని సూ చించారు. సమీక్షలో సీఈవో గోవింద్‌, జడ్పీటీసీలు శంకర్‌, గడ్డం సుమనరెడ్డి, కమల, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:27:22+05:30 IST