శారీర దారఢ్య పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-09T00:45:29+05:30 IST

పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల కోసం శారీర దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఉదయం 5గంటల నుంచి పరీక్షలు నిర్వహించారు.

శారీర దారఢ్య పరీక్షలు ప్రారంభం

మొదటి రోజు 518 మంది అభ్యర్థుల హాజరు

పారదర్శకంగా పరీక్షలు

అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు : పోలీసు కమిషనర్‌ నాగరాజు

ఖిల్లా, డిసెంబరు 8: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాల కోసం శారీర దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఉదయం 5గంటల నుంచి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, ఎటువంటి ప్రలోభాలకు అభ్యర్థులు వెళ్లరాదని పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మాటలు చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. మొదటి రోజు 600 మంది పురుష అభ్యర్థులను పిలువగా అందులో 518 మంది హాజరయ్యారు. ఉదయం నుంచే అభ్యర్థులకు సర్టిఫికెట్ల వేరిఫికేషన్‌, బయోమెట్రిక్‌ తర్వాత 1600 మీటర్ల పరుగు పందేం నిర్వహించి, ఎత్తు కొలిచి అర్హత సాధించిన అభ్యర్థులకు కొంత సమయం విశ్రాం తి కల్పించి తదుపరి ఈవెంట్స్‌ నిర్వహించడం జరిగింది. మైదానంలో అభ్యర్థులకు మంచినీళ్ల సదు పాయం, మెడికల్‌ టీం, అంబులెన్సులు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా (రేడియో ఫ్రిక్వెన్సి ఐడెంటిఫికేషన్‌ రీడర్‌) ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ ఎంపికలను పోలీసు కమిషనర్‌ పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు అరవింద్‌బాబు, అదనపు డీసీపీ(ఏఆర్‌)గిరిరాజు, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ సీటీసీఏసీపీలు ఎ.వెంకటేశ్వర్‌, ఆర్‌.ప్రభాకర్‌రావ్‌, కెఎం.కిరణ్‌కుమార్‌, శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.సంతోష్‌, జిల్లా పరిపాలన అధికారి రామారావు, మ్యాగ్నిటిక్‌ ఇన్ఫోటిక్‌ వెయిట్‌లిమిటెడ్‌ ఇన్‌చార్జి మణికంఠ, ఇన్స్‌పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది చేపట్టారు.

Updated Date - 2022-12-09T00:45:30+05:30 IST