వెల్కటూర్‌లో అధికారుల విచారణ

ABN , First Publish Date - 2022-03-05T06:08:44+05:30 IST

‘అవకతవకల్లో అధికారుల చేతివాటం’ అనే శీర్షికన ఫిబ్రవరి 25వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లోప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.

వెల్కటూర్‌లో అధికారుల విచారణ


మెండోర, మార్చి4:
‘అవకతవకల్లో అధికారుల చేతివాటం’ అనే శీర్షికన ఫిబ్రవరి 25వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లోప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. గురువారం వెల్కటూర్‌ గ్రామంలో అసిస్టెంట్‌ డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రెడ్డి, స్త్రీనిధి ఆర్‌ఎం కిశోర్‌, డీపీఎం ఏరియా ఇన్‌చార్జి మారుతి, గ్రామ మహిళా సమాఖ్య సంఘాల మహిళలతో విచారణ చేపట్టారు. అవకతవకల్లో ఏపీఎం ప్రమే యం ఎంత ఉందని మహిళలను ఆరా తీశారు. తమ తప్పు ఏమిలేదని తమ ప్రమేయం ఉందని తేలితే ఎంతటి శిక్షపడిన బరిస్తామని ఏపీఎం తెలిపారు. సీఏ పద్మ తమ ప్రమేయం ఏమి లేదని విచారణ అధికారుల ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అమా యకంగా తనను ఏపీఎం ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేశా రని, ఎల్‌ఐసీ పాలసీలు కట్టించుకున్నారని అధికారుల ముందు సీఏ మొర పెట్టుకుంది. గ్రామ మహిళా సమాఖ్య సభ్యురాలు ఏపీఎం తన ప్రమేయం లేనిదే ఎప్పుడైతే పత్రికలో వచ్చిన కథనాల నుంచి ఇప్పటి వరకు ఎందుకు గ్రామానికి రాలేదని నిలదీశారు. ఏదిఏమైన అవకతవకల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉందో తేల్చి తమకు న్యాయం చేయాలని మహిళలు అధికారులకు విన్నవించారు. అనంతరం విచారణకు వచ్చిన అధికారులు నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం బ్యాంక్‌ లింకేజీ నిలిమ, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ అనూష, డీఎంలు మధు, జనార్ధన్‌, సీసీలు విక్రం, సాయన్న, మహిళా సమాఖ్య సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు.

Read more