వ్యవసాయ రంగంలో నర్సింగ్‌పల్లి ఆదర్శం

ABN , First Publish Date - 2022-12-04T23:01:59+05:30 IST

వ్యవసాయం చేయడంలో నర్సింగ్‌పల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో మాపల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సేంద్రి య వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. వరిలో పండించిన అనేక రకాల ధా న్యాలను పరిశీలించారు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట దిగుబడి కోసం ర సాయనిక ఎరువులను వాడడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నా రు.

వ్యవసాయ రంగంలో నర్సింగ్‌పల్లి ఆదర్శం

మోపాల్‌, డిసెంబర్‌ 4: వ్యవసాయం చేయడంలో నర్సింగ్‌పల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామంలో మాపల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సేంద్రి య వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. వరిలో పండించిన అనేక రకాల ధా న్యాలను పరిశీలించారు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట దిగుబడి కోసం ర సాయనిక ఎరువులను వాడడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నా రు. రోజురోజుకూ వ్యవసాయ క్షేత్రాల్లో సారవంతమైన నేల కనుమరుగవుతుండడం తో దిగుబడి తక్కువగా వస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో నర్సింహారెడ్డి సేంద్రి య వ్యవసాయం చేసేందుకు గ్రామ రైతులను చైతన్యవంతులను చేస్తూ పంటలు పండిస్తున్నారని వివరించారు. బీపీ, షుగర్‌తో పాటు ఇతర రోగాలు రాకుండా ఉం డేందుకు అనేక రకాల పంటలను కూడా పండించడం సంతోషకరమన్నారు. నర్సింగ్‌పల్లి గ్రామంలో పండిస్తున్న రైతులను చూసి ఇతర గ్రామస్తులు కూడా ఇటువంటి పంటలను పండించేందుకు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్‌ తరంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండ ఉండాలంటే సేంద్రియ వ్యవసాయంపై రైతులు ఎక్కువగా మొగ్గుచూపాలన్నారు. ఆవులను పెంచడం వల్ల వాటితో రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట నాయకులు అంతిరెడ్డి రాజారెడ్డి, ముప్ప గంగారెడ్డి, ఎంపీటీసీ రాములు, ఉప సర్పంచ్‌ రాజేశ్వర్‌, రవీందర్‌, రైతులు ఉన్నారు.

క్షేత్రాన్ని సందర్శించిన సైంటిస్ట్‌ నవీన్‌

గ్రామంలో రైతులు పండిస్తున్న పంట పొలాలను శాస్త్రవేత్త నవీన్‌ పరిశీలించారు. త్వరలో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో నర్సింగ్‌పల్లిలో పండిస్తున్న వ్యవసాయంపై ప్రస్తావించనున్నట్లు ఆయన పేర్కోన్నారు.

Updated Date - 2022-12-04T23:02:00+05:30 IST