ప్రయాణికులతో స్నేహభావంగా మెలగాలి

ABN , First Publish Date - 2022-03-06T05:03:10+05:30 IST

ఆటోలు నడిపే డ్రైవర్లు ప్రయాణికులను స్నేహభావంగా చూడాలని, వారిని సోదరులుగా భావించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సీపీ నాగరాజు తెలిపారు.

ప్రయాణికులతో స్నేహభావంగా మెలగాలి

ఖిల్లా, మార్చి 5: ఆటోలు నడిపే డ్రైవర్లు ప్రయాణికులను స్నేహభావంగా చూడాలని, వారిని సోదరులుగా భావించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సీపీ నాగరాజు తెలిపారు. శనివారం పోలీస్‌ మైదానం లో ప్రయాణికుల రక్షణ కోసం ‘మై ఆటో ఇన్‌ సేఫ్‌’ కా ర్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలో ప్రయాణికులను సులభంగా, సురక్షితమైన రవాణా విధానం ద్వారా ఆటో రిక్షాలు, క్యాబ్‌లలో ప్రయాణికులను మరింత భద్రంగా సౌకర్యాలు అందించడమేకాకుండా ప్రయాణికుల సమస్యలను పర్యవేక్షించడానికి ఆటో మేనేజ్‌మెంట్‌ యాజమాన్యం ఆర్టీఏ వారి నియమాలను పాటించడంలేదని అన్నారు. నిబంధనల ప్రకారం ఆటోలను నడపాలని, నేరస్తులకు సహకారం అందించవద్దని కోరారు. మై ఆటో ఇన్‌ సేఫ్‌ కార్యక్రమంలో భాగంగా ఆటో రిక్షాలు, క్యాబ్‌ సర్వీసెస్‌ వాహన యాజమాన్యం నుంచి అవసరమైన డాక్యూమెంట్‌లు, సమాచారాన్ని సేకరించి డిజిటలైజ్‌ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారాన్ని ప్రతి ఆటోరిక్షాకు బోర్డులు, స్టిక్కర్‌లు జారీ చేస్తామన్నారు. ప్రతీ వాహనానికి డ్రైవర్‌ సీటు వెనకభాగంలో లామినేటెడ్‌ బోర్డు, ఫ్రంట్‌ మిర్రర్‌ స్టిక్కర్‌, వాహనానికి వెనకభాగానికి స్టిక్కర్‌ అతికించనునట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బా బు, అదనపు డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ డాక్టర్‌ వినిత్‌జీ, అదనపు డీసీపీ అడ్మిన్‌ ఉషావిశ్వనాథ్‌తిరునగరి, అదన పు డీసీపీ ఏఆర్‌ గిరిరాజ్‌, రమేష్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, ట్రాఫిక్‌ సీఐ చందర్‌రాథోడ్‌, ట్రాఫిక్‌ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు పాల్గొన్నారు.

Read more