జిల్లాలో 351 పాఠశాలల ఆధునికీకరణ : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-12-16T00:48:26+05:30 IST

జిల్లాలో 351 పాఠశాలల ను మన ఊరు మన బడి ద్వారా కర్పొరేట్‌ స్థాయికి ఆధునికీకరి స్తున్నామని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు.

జిల్లాలో 351 పాఠశాలల ఆధునికీకరణ : కలెక్టర్‌

లింగంపేట, డిసెంబరు 15 : జిల్లాలో 351 పాఠశాలల ను మన ఊరు మన బడి ద్వారా కర్పొరేట్‌ స్థాయికి ఆధునికీకరి స్తున్నామని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. ఆయన గురు వారం లింగంపేట మండలం సురాయి పల్లి, పోతాయిపల్లి ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. లింగంపేట మండలంలో 27 పాఠశాలలు మన ఊరు మన బడికి ఎంపికయ్యాయని తెలిపారు. సురాయిపల్లి పాఠశాలకు రూ.7,41, 553, పోతాయిపల్లి పాఠశాలకు రూ.7, 78,696 మజూరయ్యాయని ఆయన తెలి యజేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు పను లను వేగవంతం చేయాలని ఆదేశించారు. డ బ్బులు ఆలస్యం అవు తాయనే అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. పాఠశాలలకు మంజూరై న నిధులతో విద్యుదీకరణ, తాగునీటి కోసం సంపు నిర్మాణం, పైపులైన్‌ టాయిలెట్స్‌, భవనాల మేజర్‌, మైన ర్‌ రిపేర్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తి స్థాయి మౌలిక సదు పాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చే స్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలకు విద్యుదీకరణ పూర్తయిందని, మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, ఎంఈవో రామస్వామి, డీఈ నారాయణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి, హెచ్‌ఎం దామోదర్‌, ఉన్నారు.

Updated Date - 2022-12-16T00:48:28+05:30 IST