కేవైసీ అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌.. ఖాతాల్లోంచి నగదు చోరీ

ABN , First Publish Date - 2022-03-05T05:57:09+05:30 IST

గుర్తుతెలియని ఫోన్‌ నెంబరు నుంచి కేవైసీ అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌ రాగా.. ఆ మెసేజ్‌కి స్పందించి లింక్‌ ఓపెన్‌ చేయగానే ఖాతాల్లోంచి నగదు చోరీ జరిగింది.

కేవైసీ అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌.. ఖాతాల్లోంచి నగదు చోరీ

దోమకొండ, మార్చి 4: గుర్తుతెలియని ఫోన్‌ నెంబరు నుంచి కేవైసీ అప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌ రాగా.. ఆ మెసేజ్‌కి స్పందించి లింక్‌ ఓపెన్‌ చేయగానే ఖాతాల్లోంచి నగదు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎస్సై సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంఛనూర్‌ గ్రామాని కి చెందిన బరిగెల సురేష్‌ తన ఫోన్‌కి గత నెల 28న 08276966626 నెంబర్‌ నుంచి 9505731434కి కేవైసీ ఆప్‌డేట్‌ చేయాలని మెసేజ్‌ వచ్చింది. సురేష్‌ ఫోన్‌ ఫే ఓపెన్‌ కాకాపోవడంతో వెంటనే కేవైసీని అప్‌డేట్‌ చేయా లని ఉద్ధేశంతో లింక్‌ను ఓపెన్‌ చేశాడు. ఫోన్‌ నెంబర్‌ను ఎంట్రీ చేయగానే ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంట్రీ చేయగానే అకౌంట్‌లోంచి రూ.24900 ఖాతా లోంచి డ్రా అయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read more