కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద మదన్‌ పంచాయితీ

ABN , First Publish Date - 2022-05-18T05:47:42+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఐటీసెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవ ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్‌రావు జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను, సెకండ్‌ క్యాడర్‌ నాయకులను కాదనుకొని మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నార నే దానిపై కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ వచ్చాయి.

కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద మదన్‌ పంచాయితీ

ఫ నేడు గాంధీభవన్‌లో క్రమ శిక్షణ కమిటీ ఎదుట హాజరుకానున్న మదన్‌మోహన్‌రావు

ఫ కమిటీ అధ్యక్షుడు చెన్నారెడ్డి సమక్షంలో విచారణ

ఫ రెండు రోజుల క్రితం కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడిని వివరణ కోరిన కమిటీ

ఫ జిల్లా కాంగ్రెస్‌ వర్గపోరుపై అధిష్ఠానం సీరియస్‌

ఫ సమన్వయంగా ఉండకుంటే వేటు తప్పదని హెచ్చరికలు


కామారెడ్డి, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ఐటీసెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవ ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మదన్‌మోహన్‌రావు జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను, సెకండ్‌ క్యాడర్‌ నాయకులను కాదనుకొని మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నార నే దానిపై కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతూ వచ్చాయి. ఇది వరకే ఇరువర్గాల వారు అధిష్ఠానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నా రు. దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. మదన్‌మోహన్‌రావు పంచాయితీ చివరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం చెంతకు చేరింది. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ క్రమ శిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని మదన్‌మోహన్‌రావుకు అధిష్ఠానం ఆదేశించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ చెన్నారెడ్డి సమక్షంలో మదన్‌మోహన్‌రావును కమిటీ సభ్యులు విచారించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ను క్రమశిక్షణ కమిటీ గాంధీభవన్‌లో విచారించినట్లు సమాచారం. మదన్‌మోహన్‌రావును ఏ అధికారంతో డీసీసీ అఽధ్యక్షుడు సస్పెండ్‌ చేశాడనే దానిపై కమిటీ సభ్యులు వివరణ కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు మదన్‌మోహన్‌రావు నిర్వహిస్తున్నాడని, పార్టీ కండువా కప్పుకుని తన సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్‌ క్యాడర్‌లో గ్రూప్‌ తగాదాలు చేస్తున్నాడనే దానిపై డీసీసీ అధ్యక్షుడు క్రమ శిక్షణ కమిటీకి నివేదించినట్లు తెలిసింది. బుధవారం మదన్‌మోహన్‌రావును క్రమశిక్షణ కమిటీ విచారించనుంది. విచారణ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం మదన్‌మోహన్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి

మదన్‌మోహన్‌పై ఆరు నియోజకవర్గాల నేతల ఫిర్యాదు

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఐటీసెల్‌ ఇన్‌చార్జ్‌ మదన్‌మోహన్‌రావుపై కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, ఆందోల్‌, నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సీనియర్‌ నేతలు షబ్బీర్‌అలీ, సుభాష్‌రెడ్డి, కాసుల బాలరాజు, గంగా రాం, దామోదర్‌ రాజనర్సింహలతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేత లు మదన్‌మోహన్‌రావు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాడంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్ఠానం మదన్‌మోహన్‌రావు తీరుపై సీరియస్‌గా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మదన్‌మోహన్‌రావును విచారించాలని పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. దీం తో బుధవారం కమిటీ ఎదుట హాజరుకావాలని మదన్‌మోహన్‌రావుకు ఆదేశా లు జారీ చేసింది

అన్ని నియోజకవర్గాల్లోనూ విబేధాలు

పీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌గా ఉన్న మదన్‌మోహన్‌రావు 2019 ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తన ఓటమికి పార్టీనేతలే కారణమనే భావనతో ఆయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉం టున్నారు. తర్వాత తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లోనూ మదన్‌మోహన్‌రావు తన సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే పలు కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. మదన్‌ అన్న యూత్‌ ఫోర్స్‌ అనే పేరుతో కార్యక్రమాలు చేపడుతూ ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్‌ సీనియర్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే వాదన కాంగ్రెస్‌ శ్రేణుల్లో వినిపిస్తోంది. మదన్‌మోహన్‌రావు తన సొంత ఎజెండాతో ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టడం కాంగ్రెస్‌ నేతలను గ్రూప్‌లుగా విడగొట్టడంపై స్థానికంగా ఉండే సీనియర్‌ నేతలతో విబేధాలు ముదురుతూ వచ్చాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలే కాకుండా సంగారెడ్డిలోని జహీరాబాద్‌, ఆందోల్‌ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ నేతలతో మదన్‌మోహన్‌రావుకు విభేదాలు నెలకొన్నట్లు ఆ పార్టీలో చర్చసాగుతుంది.

Read more