న్యాయవ్యవస్థకు న్యాయవాదులు పునాదులు
ABN , First Publish Date - 2022-03-06T04:57:47+05:30 IST
న్యాయవ్యవస్థకు న్యాయవాదులే పునాదులని, సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్ విజయసేనారెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైకోర్టు జడ్జి జస్టీస్ విజయసేనారెడ్డి
కామారెడ్డి, మార్చి 5: న్యాయవ్యవస్థకు న్యాయవాదులే పునాదులని, సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టీస్ విజయసేనారెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు పోలీసు గౌరవవందనం స్వీకరించి కోర్టు ప్రాంగణాన్ని కలెక్టర్ జితేష్‌వి.పాటిల్, జస్టిస్ సుభాష్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు జడ్జిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు జిల్లా కోర్టు జడ్జి రమేష్‌బాబు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి, మొబైల్‌కోర్టు మేజిస్ట్రేట్ వెంకటేష్, ఎస్‌పీ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్‌పీ అనోన్య, డీఎస్‌పీ సోమనాఽథం, జిల్లా కోర్టు బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతి, న్యాయవాదులు రామచంద్రరెడ్డి, జగన్నాథం, శంకర్‌రెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, నందరమేష్,నిమ్మదామోదర్‌రెడ్డి, గంగాధర్, శ్రీకాంత్‌గౌడ్, దేవేందర్‌గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.