ఔట్‌ సోర్సింగ్‌పై ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-05T06:14:22+05:30 IST

తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సోమవారం ఒక ప్ర కటనలో తెలిపారు.

ఔట్‌ సోర్సింగ్‌పై ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డిటౌన్‌,జూలై 4: తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సోమవారం ఒక ప్ర కటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తుతో పాటుగా ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ ప్రతులు, 2 పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలతో ఈనెల 6 సాయంత్రం 5 గంటలలోపు జిల్లా మైనార్టిశాఖ అధికారి కార్యాయంలో దరఖాస్తుచేసుకోవాలని తెలిపారు. కామారెడ్డి,ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సువాడలో మొత్తం 7 పోస్టులకు గాను 5 స్త్రీలకు, 2 పురుషులకు కేటాయించగా మూడేళ్ల అనుభవం అవసరమని తెలిపారు. 

Read more