రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
ABN , First Publish Date - 2022-03-05T05:56:45+05:30 IST
పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ సమీపంలో శుక్రవారం వాహనం అదుపుతప్పి ఒకరు గాయపడినట్లు ఎస్‌హెచ్‌వో నరేష్ తెలిపారు.
కామారెడ్డి, మార్చి 4: పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ సమీపంలో శుక్రవారం వాహనం అదుపుతప్పి ఒకరు గాయపడినట్లు ఎస్‌హెచ్‌వో నరేష్ తెలిపారు. విద్యానగర్ కాలనీకి చెందిన మోత్కురి సంపత్‌కుమార్ తండ్రిని వెనుక కూర్చుండ బెట్టుకుని వెళ్తుండగా బొల్తాపడింది. అంజయ్య కు గాయాలైనట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ద్విచక్ర వాహనం చోరీ
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన గంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఉద్యోగం ఇప్పిస్తానని బురిడీ
పట్టణంలోని వివేకానంద కాలనీకి చెందిన జొన్న అనిలకు గుర్తు తెలియని వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించి రూ.13వేలను ఖాతాల్లోంచి నగదును చోరీ చేసినట్లు ఎస్‌హెచ్‌వో నరేష్ తెలిపారు. ఉద్యోగ అవకాశం ఇప్పిస్తానని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో మేసేజ్ చేశాడు. ఉద్యోగం వస్తుందనే ఆశతో బ్యాంకు ఓటీపీ నెంబర్ చెప్పడంతో ఆమె ఖాతాలో ఉన్న రూ.13వేల నగదును దొచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బీబీపేట: మండలంలోని జనగామ గ్రామ బస్టాండ్ సమీపంలో శుక్రవా రం తెల్లవారు జామున బీబీపేట నుంచి కామారెడ్డి వైపునకు వెళ్తున్న కారు అదుపు తప్పి నలుగురికి ఢీకొట్టింది. రోడ్డుపై వెళ్తున్న జనగామ గ్రామానికి చెందిన సాయిలు, సాకేత్‌రెడ్డి, బాలవ్వ, సంతోష్‌లకు తీవ్రగాయాలయ్యా యి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఎస్ఐ రాజారాం తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.