ఎస్సారెస్పీలోకి 73వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-08-21T06:23:24+05:30 IST

శ్రీరాంసాగర్‌ ఎగువ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 73వేల460క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో ప్రాజెక్టు 12వరదగేట్ల ద్వారా 61వేల 740క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

ఎస్సారెస్పీలోకి 73వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మెండోర, ఆగస్టు20: శ్రీరాంసాగర్‌ ఎగువ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 73వేల460క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతుండడంతో ప్రాజెక్టు 12వరదగేట్ల ద్వారా 61వేల 740క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఎస్కెప్‌ గేట్ల ద్వారా గోదావరిలోకి 4వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కులు, లక్ష్మీకాలువ ద్వారా 200 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, అలీసాగర్‌ ద్వారా 180 క్యూసెక్కులు, అవిరి రూపంలో 628 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 152 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో వెళ్తుందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (90టీఎంసీ)లు కాగా శనివారం సాయంత్రానికి శనివారం సాయంత్రానికి 1090.1అడుగులు (85.360టీఎంసీ)ల నీరు నిల్వ ఉందని, గత సంవత్సరం ఇదే రోజున 1090.6అడుగులు (88.112టీఎం)ల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 281టీఎంసీల వరదనీరు చేరగా, ప్రాజెక్టు వరదగేట్ల ద్వారా గోదావరిలోకి ప్రధానకాలువల ద్వారా 216టీఎంసీల నీరు ఔట్‌ఫ్లో వెళ్లిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.  


Updated Date - 2022-08-21T06:23:24+05:30 IST