తెలంగాణ పథకాలను చూపిస్తే రాజీనామా చేస్తా

ABN , First Publish Date - 2022-01-13T05:39:48+05:30 IST

దేశంలో బీజేపీ, కాం గ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

తెలంగాణ పథకాలను చూపిస్తే రాజీనామా చేస్తా

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్‌

వేల్పూర్‌, జనవరి 12: దేశంలో బీజేపీ, కాం గ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రైతుబంధు సంబ రాల్లో భాగంగా బుధవారం మండలంలో నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడు కేఆర్‌.సురేష్‌రెడ్డితో కలిసి మంత్రి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌లు, ఎడ్ల బండ్లతో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు ఇతర అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశం లోని బీజేపీ, కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, నిరుపించకుంటే బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు తమ పదవికి రాజీ నామా చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కంటే ముందు తెలంగాణ రైతులు ఎట్లగోస పడ్డారో.. ఏమి కావాలని కోరుకున్నారో వారి కోరికలు తీర్చిన గొప్పనాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. రైతుబంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని, రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు అందించే కార్యక్రమం కేసీ ఆరే చేయగలిగాడన్నారు. ఇప్పటి వర కు ఎనిమిది విడతలుగా రైతు లకు రూ.50 వేల కోట్లు మం జూరు చేశారన్నారు. బాల్కొండ నియోజక వర్గానికి రూ.454 కోట్లు రైతులకు అందా యన్నారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో 18చెక్‌డ్యాంలు, లిఫ్ట్‌లు, రూ.50కోట్లతో 16 సబ్‌స్టేషన్‌లు, 21 ప్యాకేజీ ద్వారా రూ.850కోట్ల ఖర్చుతో సాగు నీరు అందించడం ఈ విధంగా రైతుల కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింద న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవ సాయాధికారి గోవింద్‌, ఆర్డీవో శ్రీనివా సులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, టీఆర్‌ ఎస్‌ రాష్ట్రనేత  డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఇన్‌ చా ర్జి తహసీల్దార్‌ రాజశేఖర్‌, ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ   అల్లకొండ భా రతి, సర్పంచ్‌ రాధా మో హన్‌ ఏఎంసీచైర్మన్‌ కొట్టల చిన్నారెడ్డి, వైస్‌ ఎంపీపీ సురేష్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-13T05:39:48+05:30 IST