టీయూ సమస్యలపై దృష్టి.. సారించేనా?

ABN , First Publish Date - 2022-08-07T06:22:54+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం వర్సిటీ అధికారులతో పరిస్థితుల ను సమీక్షించనున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో చేపడుతున్న అకాడమిక్‌ కార్యక్రమాలతో పాటు పరిశోధన అంశాలపై చర్చించనున్నా రు. విద్యార్థుల సమస్యలను

టీయూ సమస్యలపై దృష్టి.. సారించేనా?
డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం

నేడు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

తొలిసారిగా చాన్స్‌లర్‌ హోదాలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాక

వర్సిటీలో అధ్యాపకులు, విద్యార్థులతో గవర్నర్‌ ముఖాముఖీ

విశ్వవిద్యాలయంలోని సమస్యలను తెలుసుకోనున్న తమిళిసై

మౌళిక వసతులు, ఖాళీల భర్తీకి పరిష్కారంచూపే అవకాశం!!

గవర్నర్‌ పర్యటనపై గంపెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులు

ఆమెను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీ నేతల ముమ్మర ప్రయత్నాలు

నిజామాబాద్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత విశ్వవిద్యాలయం వర్సిటీ అధికారులతో పరిస్థితుల ను సమీక్షించనున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో చేపడుతున్న అకాడమిక్‌ కార్యక్రమాలతో పాటు పరిశోధన అంశాలపై చర్చించనున్నా రు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడంతో పాటు కావాల్సిన ఏర్పాట్లను గవర్నర్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. కాగా, హైదరాబాద్‌ కాచీగూడ నుంచి రైలులో వస్తున్న గవర్నర్‌ ఆదివారం ఉదయం మూడు గంటలకు నిజామాబాద్‌ చేరుకుంటారు. ఇక్క డ నుంచి రోడ్డు మార్గాన బాసరలోని ట్రిపుల్‌ ఐటీకి వెళ్తారు. అక్కడి గెస్ట్‌హౌజ్‌లో బస చేస్తారు. ఉద యం 6గంటలకు బాసర అమ్మవారి ఆలయానికి గవర్నర్‌ వెళ్తారు. బాసర సరస్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్లీ ఏడు గంటలకు ట్రిపుల్‌ ఐటీకి చేరుకుంటారు. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల తో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. అనంతరం ట్రిపుల్‌ ఐటీలో ఉదయం 8గంటల నుంచి 10గంటల వర కు అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులతో గవర్నర్‌ ఇంటరాక్షన్‌ కానున్నారు. విద్యార్థుల స మస్యలను తెలుసుకుంటారు. గడిచిన రెండు నెలలుగా ట్రిపు ల్‌ ఐటీలో విద్యార్థులు సౌకర్యాల కోసం ఆం దోళన చేస్తున్నా రు. వారి ఆందోళన వల్లనే ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు కల్పించింది. ట్రిపుల్‌ ఐటీకి ఇన్‌చార్జి డైరెక్టర్‌, వీసీలను నియమించారు. అయినా.. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. వాటన్నింటినీ గవర్నర్‌ తెలుసుకోవడంతో పాటు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు పలు హామీలను ఆమె ఇచ్చే అవకాశం ఉంది. 

ఉదయ 11గంటలకు టీయూకు..

బాసర ట్రిపుల్‌ ఐటీ నుంచి గవర్నర్‌ బయలుదేరి ఉదయం 11 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయం చేరుకుంటారు. విశ్వవిద్యాలయంలోని పలు బ్లాక్‌ల ను చాన్స్‌లర్‌ హోదాలో పరిశీలిస్తారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఉద్యోగు లు, విద్యార్థులతో ఎంసీఏ భవనంలోని ఆడిటోరియంలో గవర్నర్‌ తమిళిసై మా ట్లాడతారు. తెలంగాన విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులతో పాటు విద్యార్థులకు గవర్నర్‌ మార్గదర్శకం చేయడంతో పాటు విశ్వవిద్యాలయంలోని సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి హామీ లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర గవర్నర్‌గా, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌గా ప్రభు త్వం నుంచి నిధులను మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. విద్యార్థులతో ఇంటరాక్షన్‌ పూర్తయిన తర్వాత అక్కడే వసతిగృహంలో విద్యార్థులతో కలిసి భోజ నం చేయనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుం చి తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి హైదరాబాద్‌ వెళ్తారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై జిల్లాకు వస్తుండడంతో తెలంగాణ విశ్వవిద్యాలయం లో ముందస్తు ఏర్పాట్లను అధికారులు ప్తూ  చేశారు. గవర్నర్‌ పర్యటన సాఫీగా జరిగేందుకు విద్యార్థులు, అధ్యాపకులతో ముందస్తుగా మాట్లాడడంతో పాటు పర్యటన ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేశారు. విశ్వవిద్యాలయం వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తుతో పాటు పలు కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. విశ్వవిద్యాలయంలో గవర్నర్‌ వెళ్లే అన్ని ప్రాం తాల్లో ఇన్‌చార్జి అధికారులను నియమించారు. విద్యార్థులతో వీసీ రవీందర్‌గుప్త ముందే చర్చలు జరపడంతో పాటు విశ్వవిద్యాలయంలో గవర్నర్‌ పర్యటన ప్ర శాంతంగా పూర్తయ్యేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. గవర్నర్‌ అడిగిన అన్ని ని వేదికలను కూడా అందించేవిధంగా అధికారులు సిద్ధమయ్యారు.

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. రైలు మార్గంలో వస్తున్న గవర్నర్‌.. బాసర వరకు వెళ్లేవిధంగా ఏర్పాట్ల ను చేస్తున్నారు. వాహనాల తో పాటు బందోబస్తు ఏ ర్పాట్లు పూర్తి చేశారు. బాస ర నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయం వెళ్లే వరకు ఈ ఏ ర్పాట్లను చేయడంతో పాటు తిరిగి రైల్వేస్టేషన్‌ వచ్చేంత వర కు ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకదృష్టి సారించారు. గవర్నర్‌ ప్రొటోకాల్‌కు ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు అప్రమత్తమయ్యారు.

సమస్యలు దృష్టికి వచ్చేనా?!

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై చాన్స్‌లర్‌ హోదాలో తెలంగాణ విశ్వవిద్యాలయం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సమస్యలపై దృష్టిసారించే అవకాశం ఉంది. వర్సిటీలోని సమస్యలను విద్యార్థులు గవర్నర్‌ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసినా.. స్థానిక అధికారులు అనుమతులు ఇచ్చే వాటిపైనే గవర్నర్‌ దృష్టి సారించనున్నా రు. కాగా, తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సరైన మౌళిక వసతులు లేవు. విద్యార్థులకు అవసరమైన వసతిగృహాలు లేవు. ఉన్న వసతి గృహాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉన్నారు. విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి సిబ్బంది కూడా భర్తీ కాలేదు. వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల నుంచి ప్రొఫెసర్‌ల వరకు ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి కూడా ఇప్ప టి వరకు చర్యలు చేపట్టలేదు. రాష్ట్రస్థాయిలో రిక్రూట్‌మెంట్‌కు ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ అకాడమిక్‌ కన్సల్టెంట్‌ల ద్వారానే తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పరిశోధన నిధులు కూడా అనుకు న్న విధంగా రావడం లేదు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మొదటిసారిగా విశ్వవిద్యాలయానికి వస్తున్నందున సమస్యలపై దృష్టిసారిస్తే కొన్ని సమస్యలు అయినా పరిష్కారం అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు.

గవర్నర్‌ వద్దకు ప్రతిపక్ష నేతలు

జిల్లాకు వస్తున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే విశ్వవిద్యాలయంలో కాని, రైల్వేస్టేషన్‌లో గాని ఆమెను కలిసేందుకు వారు విశ్వప్రయత్నా లు చేస్తున్నారు. జిల్లాలోని సమస్యలతో పాటు ఇతర అంశాలపైన గవర్నర్‌కు వినతిపత్రాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు అనుమతి ఇస్తే ఈ రెండు చోట్లలో వినతులను ఇతర సంఘాల నేతలూ ఇచ్చే అవకాశం ఉంది.

ఇరుకుగా బాలికల వసతి గృహం 

డిచ్‌పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రారంభమై దశాబ్ద కాలం గడిచినా.. సమస్యలు మాత్రం యధాతథంగానే ఉన్నాయి. విశ్వవిద్యాలయాని కి రూ.100 కోట్లూ మంజూరు చేసి వర్సిటీ అభివృద్ధికి పాటుపాడుతామని గతంలో పలుమార్లు హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు.. కనీసం వర్సిటీ వైపు కన్నెతి చూడటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వర్సిటీకి ప్రతియేటా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు, యూజీసీ నిఽధులు వస్తున్నా.. సిబ్బంది జీతభత్యాలకే  సరిపోతుండటంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయిలో బోధన అందించే సిబ్బంది సగాని కిపైగా ఖాళీలు ఉండటంతో ఆశించిన స్థాయిలో విద్యా బోధన జరగడం లేద ని, ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని భర్తీ చేయలని విద్యార్థులు కోరుతున్నా రు. అలాగే, విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలోనే వివిధ శాఖలు ఆడిట్‌ సెల్‌ కార్యాలయం, పరీక్షల విభాగం, బ్యాంక్‌, పోస్టల్‌ సేవల కోసం కొనసాగిస్తుండటంతో.. పరిపాలన భవనం కాస్త ఇరుకుగా మారింది. పరీక్ష లు రాసే విద్యార్థుల ప్రశ్న పత్రాలు వాటి జవాబు పత్రాలు వేర్వేరుగా ఉం డేందుకు భవనాలు లేక ఇదే భవనంలో కొనసాగుతుండటంతో పరిపాలన భవనం మరీ ఇరుకుగా మారింది. అలాగే, యూనివర్సిటీ ప్రారంభంలో విద్యార్థినులు 250 మంది కోసం నిర్మించిన హాస్టల్‌ భవనంలో ప్రస్తుతం 450 మంది ఉంటున్నారు. అంతేకాకుండా బాలికలు హాస్టల్‌లోని ఒకే గదిలో 8నుంచి 10మంది వరకు ఉండడం గమనార్హం. ఇప్పటికైనా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని గవర్నర్‌ తమిళిసై కి వినతిపత్రం అందజేస్తామని పలువురు వర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-08-07T06:22:54+05:30 IST