కళ్యాణి వాగులో పడి రైతు మృతి
ABN , First Publish Date - 2022-01-13T05:36:44+05:30 IST
పోలానికి నీటిని బోరు మోటారు ద్వారా పెట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుం ది.
ఎల్లారెడ్డి, జనవరి 12: పోలానికి నీటిని బోరు మోటారు ద్వారా పెట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో చోటు చేసుకుం ది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు దండు భూమయ్య (44) కళ్యాణి వాగులో నుంచి తన వ్యవసాయం పొలానికి నీటిని బోరుమోటారు ద్వారా పెట్టేందుకు వెళ్లాడు. మోటారు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఆయనకు ఈత రాకపోవడం, లోతు ఎక్కువ గా ఉండడంతో నీటిలో మునిగి పోయాడు. ఉపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య దండు మరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మదుసూదన్రెడ్డి తెలిపారు.