అర్హులు ఓటు హక్కు కలిగిఉండాలి

ABN , First Publish Date - 2022-11-17T01:54:19+05:30 IST

8 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హ క్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ డాక్టర్‌ యో గితా రాణా అన్నారు.

అర్హులు ఓటు హక్కు కలిగిఉండాలి

నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 16: 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటు హ క్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధిశాఖ కమిషనర్‌ డాక్టర్‌ యో గితా రాణా అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలో కొనసాగుతున్న పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. బూత్‌లెవల్‌ అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం ఇటీవల ప్రవేశపెట్టిన కీలక మార్పులు, చేర్పుల గురించి ఆమె ప్రశ్నించారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటరు జాబితాను అతికించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎన్ని కల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఆర్‌డీవోలు, తహసీల్దార్‌లు, బీఎల్‌వోలు, రాజకీయ పార్టీల నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల అధికారులతో పాటు బీఎల్‌వోల పాత్ర క్రియాశీలకమైందన్నారు. ఓటరు జాబితాను ముందుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి మార్పులు, చేర్పులు గమనిస్తే అధికారుల దృష్టికి తేవాలన్నారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత పేర్లను ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చే సేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 2023 ఓటరు జాబితా రూపకల్పన కోసం పెద్దఎత్తున కసరత్తు నిర్వహిస్తున్నామని ఇప్పటికే బీఎల్‌వోలకు అన్ని అంశాలపై పరిపూర్ణమైన శిక్షణ ఇప్పించి ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, ఆధార్‌ అనుసంధానం, ఇతర మార్పులు, చేర్పుల ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు చిత్రమిశ్రా, చంద్రశేఖర్‌, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శశికళ, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, ఆర్‌డీవోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆలయంలో యోగితా రాణా పూజలు

నిజామాబాద్‌ కల్చరల్‌: డాక్టర్‌ యోగితా రాణా నగరంలోని పాత కలెక్టరేట్‌లో గల నవదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు యోగితా రాణా కుటుంబ సభ్యుల పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్‌ అలుక కిషన్‌, కొ చైర్మన్‌ అమృత్‌కుమార్‌, కమిటీ సభ్యులు, ఉద్యోగులు అమ్మవారి శేష వస్త్రంతో యోగితా రాణాను సత్కరించారు.

Updated Date - 2022-11-17T01:54:19+05:30 IST

Read more