‘దళితబంధు’ ద్వారా ఆర్థిక అభ్యున్నతి సాధించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-04T06:13:51+05:30 IST

ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో బుధ వారం దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు.

‘దళితబంధు’ ద్వారా ఆర్థిక అభ్యున్నతి సాధించాలి: కలెక్టర్‌

ఆర్మూర్‌రూరల్‌, ఆగస్టు 3: ఎస్సీ కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో బుధ వారం దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. లబ్ధిదారుడు గడ్డం నర్సయ్య అధునాతనంగా ఏర్పాటు  హోటల్‌ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే దళిత బంధు పథకం లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ తోడ్పటుకు శ్రమను జోడించి అంకిత భావంతో కష్టపడి వ్యాపారాలను విస్తరించు కోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌, తహసీల్దార్‌ వేణుగోపాల్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T06:13:51+05:30 IST