కన్కల్‌లో పట్టపగలు చోరీ

ABN , First Publish Date - 2022-12-16T00:52:23+05:30 IST

తాడ్వాయి మండలం కన్కల్‌ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది.

కన్కల్‌లో పట్టపగలు చోరీ

తాడ్వాయి,డిసెంబరు 15: తాడ్వాయి మండలం కన్కల్‌ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన కురుమ చిన్నసాయిలు ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో జరిగిన ఓ వివాహ వేడుకలకు వెళ్లారు. ఇంటికి తాళం వేసిన చెవిన అక్కడే దర్వాజపైన ఉంచి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళం చెవితో తాళంతీసి ఇంట్లో ఉన్న బీరువా తలుపులు పగల గొట్టి బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారు అభరణాలు ఓసెల్‌ఫోన్‌ను అపహరించుకుపోయినట్లు బాధితులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించి పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. పక్కగా గమనించిన వ్యక్తులే చోరీకి పాల్పడట్లు గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2022-12-16T00:52:25+05:30 IST