దళితులు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-09-28T06:00:11+05:30 IST

సమాజంలో దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే దళితబంధు పథకం ముఖ్య లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ మండలంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చే శారు.

దళితులు ఆర్థికంగా ఎదగాలి
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పక్కన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

నిజాంసాగర్‌, సెప్టెంబరు 27: సమాజంలో దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే దళితబంధు పథకం ముఖ్య లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ మండలంలో పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికైన దళితబంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చే శారు. తెలంగాణలో దళిత బంఽధు పథకాన్ని ప్రవేశ పె ట్టారని, నాలుగు మండలాలను ఎంపిక చేయగా, నిజాం సాగర్‌ ఒక్కటి అన్నారు. 1,294 యూనిట్లు మంజూరు కాగా, 1,140 రకరకాల యూనిట్లను అందించామన్నారు. దళితుల జీవితాల్లో మార్పు చెందేందుకు ఏ ప్రభు త్వాలు చేయని పని సీఎం కేసీఆర్‌ చేశారన్నారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో వెలుగు నింపేందుకు సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం కింద నచ్చిన వారు నచ్చినట్లుగా పథకాలను ఎంపిక చేసుకుని వారు బాగుపడాలన్నారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాన మంత్రిని వేడుకున్నా ప్రవేశ పెట్టడం లేదన్నారు. బీజెపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాయన్నారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ దేశంలోనే దళితబంధు పథకం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయన్నారు. జడ్పీ చైర్‌పర్స న్‌ శోభ మాట్లాడుతూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతు న్నాయన్నారు. కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌ మాట్లాడుతూ లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకుని లాభాలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి, విండో చైర్మన్లు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more