దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

ABN , First Publish Date - 2022-12-16T00:49:30+05:30 IST

దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. ని

దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

నిజాంసాగర్‌, డిసెంబరు 15 : దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామంలో దళిత బం ధు పథకం కింద 13 యూనిట్ల ద్వారా మంజూరు కావడంతో గేదెలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా గేదెలను పరిశీలించి కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశా రు. పోషణ చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పలు విషయాను లబ్ధిదారులకు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపికచేసి దళిత బంధు పథకాన్ని అమలు చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు భరత్‌, సయ్యద్‌ యూసుఫ్‌, గంగారాం, తహసీల్దార్‌ నారాయణ, ఎంపీడీవో నాగేశ్వర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, సర్పంచ్‌ అనసూయ తదితరులున్నారు.

Updated Date - 2022-12-16T00:49:32+05:30 IST