దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: విప్‌

ABN , First Publish Date - 2022-03-05T05:57:35+05:30 IST

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సును కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి: విప్‌

కామారెడ్డి, మార్చి 4: దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సును కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో జీవితంలో స్థిరపడే వ్యాపారాలను ఎంచుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసమే పథకం అమల్లోకి తెచ్చారని తెలిపారు. దళిత రక్షణ నిధి దళిత కుటుంబాలకు దోహదపడుతుందన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వివిధ రకాల యూనిట్లు ఎంచుకుని భవిష్యత్తులో ఆర్తికంగా అభివృద్ధిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే పాల్గొన్నారు.
మహిళబంధు సంబురాలు పండగాల నిర్వహించాలి
నియోజకవర్గంలో ఈనెల 6,7,8 తేదీలలో మహిళబంధు సంబురాలు పండుగల నిర్వహించాలని ప్రభుత్వ విప్‌ గంపగోవర్దన్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులకు సంబరాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, ఎంపీపీ నర్సింగ్‌రావు, పిప్పిరి ఆంజనేయులు, బాలమణి, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, రాంరెడ్డి, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more