భారత రాజ్యాంగం చాలా గొప్పది

ABN , First Publish Date - 2022-11-27T00:48:05+05:30 IST

ప్రపంచంలోకెల్ల భారత రాజ్యంగం చాలా గొప్పదని, ప్రజల కు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విషయాల్లో సమానత్వం కల్పించిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి అన్నారు.

భారత రాజ్యాంగం చాలా గొప్పది
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా టీయూలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైౖర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి

డిచ్‌పల్లి, నవంబరు 26: ప్రపంచంలోకెల్ల భారత రాజ్యంగం చాలా గొప్పదని, ప్రజల కు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విషయాల్లో సమానత్వం కల్పించిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి అన్నారు. శనివారం డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో రాజ్యంగ దినోత్సవం పై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రాజ కీయ విషయాల్లోనూ రాజ్యంగంలో సమానత్వం కల్పించిందని భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ అందరికీ స్వేచ్ఛ, సమానత్వం రాజ్యంగంలో కల్పించరన్నారు. స్వతంత్ర్యానికి పూర్వం కొలంబియ విశ్వవిద్యాలయంలో అంబేద్క ర్‌ విద్యా అభ్యసించారని 200ఏళ్లలో తమ దగ్గర చదివిన విద్యార్థుల్లో మేధావి ఎవరూ అనే దానిపై నిర్వహించన పరిశోధనల్లో అండేద్కర్‌ ప్రపంచ మేధావుల్లో గొప్పవాడని తెలిసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 55 రెసిడెన్షియల్‌ కళాశాలలు నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యాఅందించడం అభినందనీయమని తెలంగాణ యూనివర్సిటీకి అన్ని వసతులు కల్పించేందుకు సిద్దంగా ఉన్నమని రాష్ట్ర ప్రభు త్వంతో మాట్లాడి వర్సిటీకి కావల్సిన సదుపాయాలు కల్పిస్తామని లింబాద్రి పేర్కొ న్నారు. అనంతరం వీసీ రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ రాజ్యంగ దినోత్సవం అధి కార పూర్వకంగా టీయూలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమం లో టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని, పాలక మండలి సభ్యుడు రవీందర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఆరతి, ప్రొఫెసర్‌ కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పనిచేయాలి : అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రపంచ దేశాలలో ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ స్పూర్తికి ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖ అదికారులు, సిబ్బంది చేత భారత సంవిధానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆయా వర్గాలకు రిజర్వేషన్‌లు, పౌరులకు ఓటు హక్కు, వాక్‌స్వాతంత్రం, సమానత్వపు హక్కు లభించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిద శాఖల అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నాం : సీపీ

ఖిల్లా: ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను చూసి భారత రాజ్యాంగం ను తయారు చేయడం జరిగిందని, రాజ్యాంగంలో లిఖించబడ్డ చట్టాల వల్ల వాటి స్వేచ్ఛా ఫలాలను ప్రస్తుతం మనందరం అనుభవిస్తున్నామని సీపీ నాగరాజు పేర్కొన్నారు. భారత రాజ్యంగ ప్రాదేశిక కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రాజ్యాంగ ప్రావేశిఖ కార్యక్రమాన్ని సీపీ ఆధ్వర్యంలో నిర్వహించా రు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఫోటోకు పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని కు లాల వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రచన సంఘం రెండు సంవత్సరాల 11 నెలల 17రోజుల్లో చర్చలు, సమావేశాలు జరిపి రాజ్యాంగ పేటికకు 395 అధికరణాలు, 8షెడ్యుల్‌లకు తుదిరూపునిచ్చారన్నారు. గత 73ఏళ్లలో భారత రాజ్యంగంలో అనేక మార్పులు చేర్పులకు లోనై విస్తరించిందన్నారు. ప్రజల హక్కు లు, విధుల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని భావితరాలకు మన రా జ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బాబు, ఏసీపీ సీసీఎస్‌ రమేష్‌, పోలీసు కార్యాల యం ఏవో రామారావు, రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ అనిల్‌కుమార్‌, అప్పల నాయుడు, సీపీ ఆఫీస్‌ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జడ్పీలో భారత రాజ్యాంగ దినోత్సవం

ఖిల్లా: భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో వేడుకలను చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

Updated Date - 2022-11-27T00:48:08+05:30 IST