షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ABN , First Publish Date - 2022-06-07T06:12:45+05:30 IST

మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామంలో సోమవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఓ ఇంటికి నిప్పంటుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

నిజాంసాగర్‌, జూన్‌ 6 : మండలంలోని సుల్తాన్‌నగర్‌ గ్రామంలో సోమవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఓ ఇంటికి నిప్పంటుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌నగర్‌ గ్రామానికి చెందిన మల్దొడ్డి విఠల్‌ గౌడ్‌కు చెందిన పెంకుటిల్లు ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ తగిలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న లక్ష రూపాయలతో బీరువాలోని బట్టలు కాలిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని గిర్దావర్‌ విజయ్‌ సందర్శించి పంచనామా నిర్వహించారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షల ఆస్థినష్టం వాటిల్లినట్లు తహసీల్దార్‌ నారాయణ తెలిపారు. రూ.లక్ష, 5 తులాల బంగారం, బీరువాలోని కొంత సామగ్రికి ఎలాంటి హాని కలుగలేదు. వంట సామగ్రి, గృహంలోని పలు వస్తువులు దగ్ధమైనట్లు తెలిపారు. ఎల్లారెడ్డి అగ్ని మాపక శకటం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల నిప్పంటుకోవడంతో కుటుంబీకులు నిరాశ్రులయ్యారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 

బీర్కూర్‌లో గుడిసె.. 

బీర్కూర్‌, జూన్‌ 6 : మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన కొడప్‌గల్‌ చంద్రవ్వ, నారాయణ దంపతులకు చెందిన నివాసపు గుడిసె సోమవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఇంట్లోని వస్తువులన్ని బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న బీర్కూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు అవారి గంగారాం, ఉప సరపంచ్‌ మన్నన్‌, కాలనీ యువకులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. రూ.లక్ష వరకు ఆస్తనష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు అవారి గంగారాం బాధితులను పరామర్శించి బాధితులకు రూ. 2 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎంపీపీ రఘు పరామరించారు. 

Read more