మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే బీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-12-10T01:48:01+05:30 IST

మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని మరోసారి ప్రజలను మోసం చేసి మారువేషంలో వచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే బీఆర్‌ఎస్‌

కేసీఆర్‌ ఎన్ని వేషాలు మార్చినా.. అధికారంలోకి రాడు

కేజ్రివాల్‌, కేసీఆర్‌, అసదుద్దీన్‌లు కాంగ్రెస్‌ పార్టీని చంపే సుపారీ కిల్లర్లు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫైర్‌

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 9: మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని మరోసారి ప్రజలను మోసం చేసి మారువేషంలో వచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టే ప్రత్యామ్నయమని, బీజేపీ తామే ప్రత్యామ్నాయమని చెబుతున్పప్పటికీ ఆ పార్టీకి అంత సీన్‌లేదన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రనా ప్రత్యామ్నాయం అయిపోతారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ కాదు వీఆర్‌ఎస్‌ కాబోతుంది ఆమ్‌ ఆద్మీపార్టీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బీజేపీకి బీటీంలని కేసీఆర్‌, కేజ్రివాల్‌, అసదుద్దిన్‌లు కాంగ్రెస్‌ను చంపే సుపారీ కిల్లర్స్‌ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ధరణి వల్ల 25లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరణి సమస్యలు పరిష్కరించని సీఎం దేశంలో రైతురాజ్యం ఎలా తీసుకవస్తాడని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని ఇప్పటికి అమలు చేయడంలేదన్నారు. చెరకు ఫ్యాక్టరీలను మూసేసీ రైతులను నట్టేట ముంచాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సి కవితను ఓడించినట్లే రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓడించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.బీజేపీ అభివృద్ధి నమూనా ఏమిటో ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. ఏ లెక్కన ఎన్నికల్లో వారు ఓట్లు అడుగుతారన్నారు. తాను గెలిస్తే పసుపుబోర్డు తీసుకువస్తానని ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చాడన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కదళిక లేదన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు తాహెర్‌బిన్‌ హుందాన్‌, గడుగు గంగాధర్‌, కేశవేణు, జావెద్‌ అక్రం, నగేష్‌రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:48:19+05:30 IST