అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-06-07T06:13:11+05:30 IST

పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

బిచ్కుంద, జూన్‌ 6: పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ జైపాల్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు దొంగలు మహారాష్ట్రలోని మాలేగావ్‌లో నివాసం ఉంటే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. బిచ్కుందలోని సదాశివపేట్‌, రాజేందర్‌నగర్‌తో పాటు పలుచోట్ల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. మండలకేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వాహనతనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండు తులాల ఆరుగ్రాముల బంగారం, 28 తులాల వెండి లభించినట్లు డీఎస్‌పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.

Read more