మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలి : సీపీ

ABN , First Publish Date - 2022-07-19T05:22:29+05:30 IST

మహిళల భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని విధాల సహకారాలు అందించాలని సీపీ కేఆర్‌.నాగరాజు అన్నారు. నెలవారి స మీక్షలో భాగంగా సోమవారం పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలోని మినీ సమావేశ హాల్‌లో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా ఉన్న నివేదికలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం మాట్లాడుతూ.. చాలా పోలీసుస్టేషన్ల పరిధి ల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు.

మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలి : సీపీ

ఖిల్లా, జూలై 18: మహిళల భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని, వారికి అన్ని విధాల సహకారాలు అందించాలని సీపీ కేఆర్‌.నాగరాజు అన్నారు. నెలవారి స మీక్షలో భాగంగా సోమవారం పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలోని మినీ సమావేశ హాల్‌లో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా ఉన్న నివేదికలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం మాట్లాడుతూ.. చాలా పోలీసుస్టేషన్ల పరిధి ల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ గ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి దొం గతనాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాను న్న రోజుల్లో వచ్చే పండుగల విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పండుగల్లో అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రణాళికబద్ధం గా నిఘా వ్యవస్థను ప టిష్టం చేయాలని ఆదేశించారు. అ నుమానితుల కదలికలను గమనిస్తూ ఉండాలని తెలిపారు. ఫిర్యాదుదారుడికి పోలీసులంటే నమ్మకం పెరిగేలా వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు. కోర్టు కేసుల విషయంలో పురోగతి సాధించాలని సూచించారు. డయల్‌ 100కు వచ్చే ఫి ర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని, తమ దృష్టికి వచ్చిందని, వాటిపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

Updated Date - 2022-07-19T05:22:29+05:30 IST