రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2022-01-13T05:37:13+05:30 IST

ప్రతినెలా రేషన్‌ సరుకులను సక్రమంగా లబ్ధిదారుల కు సరఫరా చేయకుండా రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పబోవని తహసీల్దార్‌ రామ్మెహన్‌రావ్‌ హెచ్చరించారు.

రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు

పిట్లం, జనవరి 12: ప్రతినెలా రేషన్‌ సరుకులను సక్రమంగా లబ్ధిదారుల కు సరఫరా చేయకుండా రేషన్‌ డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పబోవని తహసీల్దార్‌ రామ్మెహన్‌రావ్‌ హెచ్చరించారు. బుధవారం మార్తండ గ్రామంలో రేషన్‌ దుకాణంలో సరుకుల రిజీస్ట్రర్‌లో పరిశీలిం చారు. బియ్యం 26.80 క్వింటాళ్ల బియ్యాన్ని లబ్ధిదారులకు అందించకుండా అక్రమాలకు పాల్పడినందుకు 1955-6ఏ చట్ట ప్రకారం కేసు నమోదు  చేశామన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, లబ్ధిదారులకు సమయపాలన ప్రకారం బియ్యం అందించాలని, దుర్వినియో గానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-01-13T05:37:13+05:30 IST