రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2022-12-12T01:33:12+05:30 IST

డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ధర్మారం (బి) శివారులోని సుగుణ గార్డెన్‌ వద్ద నిజామాబాద్‌-డిచ్‌పల్లి ప్రధాన రో డ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని, మోటారు సైకిలిస్ట్‌ ఢీ కొన్న ఘటనలో నర్సింగపల్లి గ్రామానికి చెందిన మేక సురేశ్‌ (40) మృ తిచెందాడు. ధ

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

డిచ్‌పల్లి, డిసెంబరు 11: డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని ధర్మారం (బి) శివారులోని సుగుణ గార్డెన్‌ వద్ద నిజామాబాద్‌-డిచ్‌పల్లి ప్రధాన రో డ్డు పక్కన నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని, మోటారు సైకిలిస్ట్‌ ఢీ కొన్న ఘటనలో నర్సింగపల్లి గ్రామానికి చెందిన మేక సురేశ్‌ (40) మృ తిచెందాడు. ధర్మారం(బి) గురుకుల పాఠశాలలో చదువుతున్న తన పె ద్ద కొడుకు శ్రీహరి చరణ్‌ను చూడటానికి వెళ్తూ మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై గణేశ్‌ తెలిపారు. మృతుడి తండ్రి భూమ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతు డికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

Updated Date - 2022-12-12T01:33:16+05:30 IST

Read more