ఘనంగా బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-10-01T04:42:46+05:30 IST

బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఆరో రోజూ అలిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మను ఆరు అంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడారు. ముత్తైదువలు గౌరమ్మకు, బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు జరిపి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో బతుకమ్మ ఆడారు.

ఘనంగా బతుకమ్మ సంబురాలు

నిజాబాబాద్‌కల్చరల్‌, సెప్టెంబరు 30: బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఆరో రోజూ అలిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మను ఆరు అంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడారు. ముత్తైదువలు గౌరమ్మకు, బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు జరిపి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో బతుకమ్మ ఆడారు. అనంతరం ముత్తైదువలు ఒకరికొకరు పసుపుబొట్లు ఇచ్చుకుని బతుకమ్మను నీళ్లలో నిమజ్జనం చేశారు. అలాగే కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి, మహిళా న్యాయవాదులు, సిబ్బంది బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.

నేడు వేపకాయల బతుకమ్మ..

బతుకమ్మ సంబురాల్లో ఏడో రోజున వేపకాయల బతుకమ్మను నిర్వహించడం ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున బతుకమ్మను ఏడు అంతరాలుగా పేర్చి గౌరమ్మకు పత్ర్యేక పూజలు బియ్యం పిండితో వేపకాయలను తయారుచేసి   నైవేద్యంగా సమర్పిస్తారు.  

ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో..

పెద్దబజార్‌: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది బతుకమ్మ వేడుకలను  సంబురంగా  జరుపుకున్నారు. రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ సాధికారత అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ ఆకుల లలిత, మేయర్‌ నీతుకిరణ్‌ హాజరై బతుకమ్మ ఆడారు. వేడుకల్లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ప్రభుత్వ ఆ సుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T04:42:46+05:30 IST