మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-26T07:11:58+05:30 IST
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండా లని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతి రేక దినం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి
మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు
కోదాడటౌన్, జూన్ 25: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండా లని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతి రేక దినం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు, అధ్యాపకులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోదాడలో ఈ ర్యాలీ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి రంగా థియేటర్ మీదుగా బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ యువ తలో మాదక ద్రవ్యాల విని యోగం పెరగడం ఆందోళన కలిగించే అంశ మని, వీటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. దురలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. అనంతరం సిటీ సెంట్రల్ కాలేజీ, కిట్స్ కాలేజీ, విద్యార్థినీవిద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో పట్టణ సీఐ నర్సింహారావు, రూరల్ సీఐ నాగదుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ
హుజూర్నగర్: మత్తు పదార్థాలకు యువతీ, యువకులు దూరంగా ఉండాలని సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి కోరారు. పట్టణంలో నిర్వ హించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్ఐ
పాలకవీడు: మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్ఐ సైదులుగౌడ్ అన్నారు. పాలకవీడు లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్ర మంలో ఎంపీపీ గోపాల్ పాల్గొన్నారు.
డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలి
మునగాల: డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని ఎస్ఐ బాలునాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయించినా, సరఫరా చేసినా, వినియోగించినా కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు: ఎస్ఐ
మద్దిరాల: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని ఎస్ఐ నర్సింగ్ వెంకన్న అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నాగయ్య, కానిస్టేబుల్ మల్లయ్య, వీరస్వామి, శ్రీనివాస్, సతీష్, నారాయణరెడ్డి, మధు, హెచ్ఎం రమేష్, ఉపా ధ్యాయులు వెంకన్న పాల్గొన్నారు.