వచ్చే ఏడాది ఎంజీయూలో యోగా కోర్సు

ABN , First Publish Date - 2022-09-28T06:05:18+05:30 IST

మహాత్మాగాందీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది యోగా డిప్లొమా కోర్సును ప్రవేశపెడతామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ గోపాల్‌రెడ్డి అన్నా రు. యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల రెండో రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచేసి ఆయన ప్రారంభించారు.

వచ్చే ఏడాది ఎంజీయూలో యోగా కోర్సు
యోగాసన పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న వీసీ గోపాల్‌రెడ్డి

వైస్‌ చాన్స్‌లర్‌ గోపాల్‌రెడ్డి


నల్లగొండ, సెప్టెంబర్‌ 27: మహాత్మాగాందీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది యోగా డిప్లొమా కోర్సును ప్రవేశపెడతామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ గోపాల్‌రెడ్డి అన్నా రు. యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల రెండో రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లుగా యోగాకు ప్రాముఖ్యం పెరిగిందన్నారు. ప్రతీ ఒక్కరు నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. యోగాతో విద్యార్థుల్లో ఏకగ్రత, మానసిన ప్రశాంతత ఏర్పడటంతోపాటు, ఆధ్యాత్మిక దృక్పథం అలవడుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే ఉద్యోగావకాశాలు అభిస్తాయన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్‌ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల నుంచి 420 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఈసీ మెంబర్‌ ఆకుల రవి, ఆంజిరెడ్డి, ఓఎస్డీ అల్వాల రవి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌, పోటీల ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి, జాయిట్‌ సెక్రటరీలు రాంరెడ్డి, తోట సతీష్‌, రాంచంద్రం, సింహాద్రి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఆహ్లాదకరంగా పోటీలు

రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు రెండో రోజు ఆహ్లాదకరంగా సాగాయి. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో బాలబాలికలు ఆసనాలను ప్రదర్శించారు. పూర్ణ చక్రాసనం, పూర్ణ ధవనాసనం, వృశ్ఛికాసనం, పద్మమయూరాసనం, కర్ణపీఠాసనం, పూర్ణమశ్చ్యంద్రాసనాలను ప్రదర్శించారు. నిర్దేశిత సమయంలో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు. 150 మంది క్రీడాకారులు సెమీ ఫైనల్‌కు ఎంపిక చేశారు.

Read more