పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-10-17T06:35:37+05:30 IST
వల్లభరావు చెరువు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్ రమణాచారి కాంట్రాక్టర్లను ఆదేశించా రు.
రామగిరి, అక్టోబరు 16: వల్లభరావు చెరువు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మునిసిపల్ కమిషనర్ రమణాచారి కాంట్రాక్టర్లను ఆదేశించా రు. ఆదివారం పట్టణంలోని వల్లభరావు చెరువు, డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునిసిపల్ కొత్తచట్టం ప్రకారం డంపింగ్ యార్డును రీసోర్స్‌పార్క్‌గా పిలువ నున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న లింకు రోడ్లను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా సిద్ధిపేట, సిరిసిల్ల వంటి మునిసిపాలిటిల్లోని డంపింగ్ యార్డుల్లో జరుగుతున్న పనులపై అవగాహన కల్పించేందుకు శానిటరీ ఇనస్పెక్టర్లను అతి త్వరలో అక్కడికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ వెంకన్న, ఏఈలు సిబ్బంది తదితరులు ఉన్నారు.