రేపటి నుంచి ‘మహిళా బంధు’ సంబరాలు

ABN , First Publish Date - 2022-03-05T06:42:45+05:30 IST

జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా బంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

రేపటి నుంచి ‘మహిళా బంధు’ సంబరాలు
దేవరకొండలో విలేకరులతో మాట్లాడుతున్న రవీంద్రకుమార్‌

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ 

దేవరకొండ, మార్చి 4 : జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా బంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం దేవరకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుమేరకు మహిళాబంధు, కేసీఆర్‌ పేరిట సంబరాలు జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధానం ఇస్తోందన్నారు. సంబరాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ జాన్‌యాదవ్‌, సునితాజనార్ధన్‌రావు, మారేపాకల అరుణసురే్‌షగౌడ్‌, కంకనాల ప్రవీణవెంకట్‌రెడ్డి, హనుమంతు వెంకటే్‌షగౌడ్‌, టీవీఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:42:45+05:30 IST