మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-24T00:39:14+05:30 IST

బ్యాంకులు అందించే రుణాలతో మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

బీబీనగర్‌, నవంబరు 23: బ్యాంకులు అందించే రుణాలతో మహిళలు ఆర్థిక పరిపుష్ఠి సాధించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో మహిళా సంఘాలకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బీబీనగర్‌ సమాఖ్య రాష్ట్రంలో మోడల్‌ సమాఖ్యగా ఎంపికైనట్లు తెలిపారు. ఆరోగ్యం, విద్య, జీవనోపాధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో కోతుల బెడద ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకొని మహిళలు కూరగాయలు సాగు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు సామాజిక బాధ్యతగా అంగన్‌వాడీ కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరును గమనించాలన్నారు. ఓటరు నమోదుపై మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి ఓటు హక్కు కలిగి ఆధార్‌ అనుసంధానం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:39:14+05:30 IST

Read more