గంధమల్ల రిజర్వాయర్ పనులేవీ?
ABN , First Publish Date - 2022-04-30T06:26:32+05:30 IST
గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, అసలు రిజర్వాయర్ నిర్మాణం ఉన్న ట్టా? లేనట్టా? అని జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు.
ప్రైవేటు ఆస్పత్రులను కట్టడిచేయాలి
జడ్పీ సమావేశంలో సభ్యుల డిమాండ్
భువనగిరి రూరల్, ఏప్రిల్ 29: గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, అసలు రిజర్వాయర్ నిర్మాణం ఉన్న ట్టా? లేనట్టా? అని జడ్పీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కుడుదుల నగేశ్ మాట్లాడారు. గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణాన్ని 9టీఎంసీల నుంచి 4.28టీఎంసీలకు కుదించారని, దీనిపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ య త్నిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు రాజకీయం చేయడం మానుకోవాలని టీఆర్‌ఎస్ సభ్యులు అన్నారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర ఆరోపణలతో సమావేశం గందరగోళంగా మారింది. ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ పనులను ప్రారంభించింద ని, నేటికీ గంధమల్ల డీపీఆర్ రూపొందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంద ని నగేశ్ అన్నారు. దీంతో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి జోక్యం చేసుకుని సీఎం నిర్ణయం మేరకు గంధమల్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయవద్దని, జడ్పీ సమావేశానికి ఎంపీపీలు ఆహ్వానితులు మాత్రమేనని, భవిష్యత్తులో ఎంపీపీలు మాట్లాడే అవకాశం కోల్పోవద్దని హెచ్చరించారు. కాగా, భువనగిరి, చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంలో డీసీహెచ్‌వో, డీఎంహెచ్‌వో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ధనావత్ బీకునాయక్, సభ్యులు నరాల నిర్మల తోటకూరి అనురాధ, ఎండి.ఖలీల్, జోసఫ్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, రమేశ్, అశోక్ పాల్గొన్నారు.