TRS : నాయకులు.. కార్యకర్తలు శభాష్
ABN , First Publish Date - 2022-11-04T06:17:13+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. నెల రోజులుగా శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
మునుగోడులో మీ శ్రమకు అభినందనలు
సోషల్ మీడియా వారియర్లకు ప్రశంసలు
వేర్వేరు ప్రకటనల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్
హైదరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ.. నెల రోజులుగా శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు కేటీఆర్ ఽకృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశం మేరకు ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకు తరలివచ్చి.. ప్రభుత్వ సుపరిపాలనను ప్రజలకు వివరించి గెలుపునకు కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సోషల్ మీడియా వారియర్లను పార్టీ తరఫున అభినందించారు. కాగా, మునుగోడులో పార్టీ గెలుపునకు కృషి చేసిన ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సుపరిపాలనను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ.. బీజేపీ కుట్రలను ఎండగట్టారని ప్రశంసించారు.