సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

ABN , First Publish Date - 2022-09-11T06:14:25+05:30 IST

ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మునుగోడు ఉ పఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభాకర్‌రెడ్డి

మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

మర్రిగూడ, సెప్టెంబరు 10: ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే మునుగోడు ఉ పఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయని  మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నామపురం గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి శంకర్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మునుగోడు నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ వల్లే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను చూసి నేడు ఎంతోమంది స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌ పా ర్టీలో చేరుతున్నారని అన్నారు. కార్యక్రమంలో శివన్నగూడ వ్యవసాయ పరపతి సంఘం చైర్మన బాలం నర్సింహ, శ్రీను, వెంకటేష్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Read more