ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటాం : చాడ

ABN , First Publish Date - 2022-10-05T06:06:15+05:30 IST

తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామ ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కా ర్యదర్శి చాడ కిషనరెడ్డి తెలిపారు.

ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటాం : చాడ
అమరవీరుడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న చాడ కిషనరెడ్డి

 నల్లగొండ, అక్టోబరు 4: తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామ ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కా ర్యదర్శి చాడ కిషనరెడ్డి తెలిపారు. నల్లగొండ మండలం జి.చెన్నారం గ్రామానికి చెందిన ఆ వుల కృష్ణయ్య టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం కృషి చేయడంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కృష్ణయ్య కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషనరెడ్డి మంగళవారం వారి నివాసానికి వెళ్లి భార్య, కుమారులను పరామర్శించారు. అదే విధంగా ఉప్పనూతల ప్రభాకర్‌ తల్లి దుర్గమ్మను పరామర్శించారు. ఉద్యమకారుల కుటుంబాలకు  అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కట్లా శ్రీనివాస్‌, నాయకులు గుర్రం సాం బయ్య, గంగరాజు, విజయ్‌, శేఖర్‌, స్వామి, కృష్ణయ్య, పురుషోత్తం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. Read more