జిల్లా సాధన ఉద్యమంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-08-17T06:18:15+05:30 IST

జిల్లాసాధన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సీనియర్‌ జర్నలి స్టులు ఖాజా హమీదొద్దీన్‌, కలిమెల నాగయ్య కోరారు.

జిల్లా సాధన ఉద్యమంలో భాగస్వాములు కావాలి
నినాదాలు చేస్తున్న జర్నలిస్టులు

మిర్యాలగూడ, ఆగస్టు 16: జిల్లాసాధన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సీనియర్‌ జర్నలి స్టులు ఖాజా హమీదొద్దీన్‌, కలిమెల నాగయ్య కోరారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం జరిగిన జర్నలిస్టుల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఆయకట్టు ప్రాంతాలైన నాగార్జునసాగర్‌, మిర్యాల గూడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు ఆర్థిక, వ్యాపార లావా దేవీలతోపాటు మార్కెటింగ్‌ సౌకర్యం ఉందన్నారు. మూడు నియోజవర్గాల ప్రజలను కలుపుకొని బలమైన ఉద్యమాన్ని నిర్మించాలన్నారు. సమావేశంలో జిల్లా సాధనసమితి నాయకులు జాడి రాజు, మలోతు దశరథనాయక్‌, రాపోలు పరమేష్‌, మారం శ్రీనివాస్‌, తాళ్లపల్లి రవి, మాడ్గుల శ్రీనివాస్‌, బెజ్జం సాయి, జర్నలిస్టులు అయూ బ్‌, మనోజ్‌, మంద సైదులు, రంగ శ్రీనివాస్‌, మట్టయ్య, రమేష్‌, నాగాచారి, నాగేశ్వరరావు, నాగభూషణం, రమేష్‌నాయక్‌, వేణు, హరీష్‌ పాల్గొన్నారు. 

నార్కట్‌పల్లి: అమ్మనబోలును మండలంగా ఏర్పాటు చేసి నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలనే మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మం గళవారం 24వ రోజుకు చేరుకున్నాయి. గ్రామానికి చెందిన వృద్దులు, మహిళలు దీక్షలో కూర్చుని తమ డిమాండ్‌ను మూకుమ్మడిగా ప్రభుత్వానికి వినిపించారు. గట్టుప్పల్‌ తరహాలో అమ్మనబోలును మండలంగా చేయాలని కోరారు. 


Read more